సాయికిరణ్ అడవి దర్శకత్వంలో ఆది హీరోగా వచ్చిన సినిమా ఆపరేషన్ గోల్డ్ ఫిష్. ఈ సినిమాలో హీరో NSG కమాండర్ పాత్ర పోషించారు. కాశ్మీర్ , భారత్ పాక్ సరిహద్దు, తీవ్రవాదం సబ్జెక్ట్ తో సినిమా తీశారు. కథ చాలా పెద్దది కానీ దానికి పెట్టిన బడ్జెట్ చాలా తక్కువ. అది స్పష్టంగా స్క్రీన్ పై కనిపిస్తుంది. ఇదే మూవీ కి పెద్ద మైనస్. మినిస్టర్ కూతురుని NSG కమాండర్ కాపాడడం..ప్రేమలో పడడం ఇలా సినిమా నడుస్తోంది. కథను సరిగ్గా చూపించకుండా అనవసర లవ్ స్టోరీ చిరాకు తెప్పిస్తుంది. పూర్తిగా బోరింగ్ మూవీ.