సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య సినిమా మెగా మాస్ బ్లాక్ బస్టర్ అయ్యింది. కేవలం 3 రోజుల్లోనే సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ తో చిరుకి ది బెస్ట్ కంబ్యాక్ ఇచ్చింది. కేవలం ఇది మాత్రమే కాదు బాలయ్య నటించిన వీరసింహ రెడ్డి సినిమా కూడా దాదాపు 100 కోట్ల గ్రాస్ కు చేరువైంది.
అటు చిరు, ఇటు బాలయ్య ఇద్దరూ కూడా సంక్రాంతికి మాస్ హిట్ లతో డ్రీమ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఈ 2 సినిమాలతో టాలీవుడ్ లో అత్యధికంగా 100 కోట్ల సినిమాలతో హీరోల జాబితాలో చేరిపోయారు.
ఇక పోతే టాలీవుడ్ లో 100 కోట్ల సినిమాల్లో అత్యధికంగా మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి హీరోలతో పాటు యువ హీరోలు వైష్ణవ్ తేజ్, నిఖిల్ కూడా 100 కోట్ల క్లబ్ లో ఉన్నారు.
Also Read: ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు..ఆడు మగాడ్రా బుజ్జి..!
మహేశ్ బాబు- దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట వంటి సినిమాలు 100 కోట్ల క్లబ్ లో ఉన్నాయి. అల్లు అర్జున్ సరైనోడు, దువ్వాడ జగన్నాథం, రేస్ గుర్రం, అల వైకుంఠపురంలో, పుష్ప, ప్రభాస్ బాహుబలి1, బాహుబలి 2, సాహో, రాధే శ్యామ్, జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత, జై లవ కుశ, జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో, రామ్ చరణ్ మగధీర, రంగస్థలం సినిమాలతో ఉన్నారు.
చిరంజీవి ఖైదీ నెం 150, సైరా, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్, వకీల్ సాబ్, అజ్ఞాతవాసి,భీమ్లా నాయక్, నాని ఈగ, ఎమ్‌సీఏ, బాలకృష్ణ అఖండ వీరసింహారెడ్డి, వైష్ణవ్ తేజ్ ఉప్పెన ,కార్తికేయ 2 నిఖిల్, విజయ్ దేవర కొండ గీత గోవిందం సినిమాలతో 100 కోట్ల క్లబ్ లో ఉన్నారు.
Also Read: సీనియర్ ఎన్టీఆర్ ఆస్తులు ఎక్కడ…!?