అఖండ విజయంతో బాలయ్య వరుస సినిమాల్ని లైన్ లో పెట్టాడు. ఇప్పటికే గోపిచంద్ మలినేనితో బాలయ్య ఓ సినిమా తీస్తున్నారు. మరోవైపు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో కలిసి ఎన్బీకే 108 చేస్తున్నారు బాలకృష్ణ. అయితే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్ళడానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. ఈ సినిమాకు సంబంధించి అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పలు ఆసక్తికరమైన అప్ డేట్స్ బయటకు వస్తున్నాయి.
ఇప్పటికే ఓ తండ్రి, కూతురు చుట్టూ ఈ సినిమా కథ అల్లుకుని ఉంటుందని తెలిసింది. బాలయ్య తండ్రి పాత్రలో కనిపించనుండగా..పెళ్లిసందD ఫేమ్ శ్రీలీలా కూతురిగా నటించనుందని డైరెక్టర్ అనిల్ రావిపూడి స్వయంగా ‘ఎఫ్3’ ప్రమోషన్స్ లో బయటకు పెట్టారు. ఇందులో ఓ ప్రముఖ హీరోయిన్ ప్రియమణి కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. బాలయ్య సరసన ప్రియమణి హీరోయిన్ గా కనిపించనుందని సమాాచారం. మాస్ మహారాజా రవితేజ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించనున్నాడన్న ప్రచారం జోరుగా జరిగింది.
ఈ నేపథ్యంలో తాజాగా మరో కొత్త రూమర్ వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో తెలుగు హీరోయిన్ అంజలి బాలయ్య సరసన ఓ ముఖ్య పాత్రలో కనిపించనుందని.. అయితే.. ఆ రోల్ నెగెటివ్ షేడ్స్ కలిగి ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అంటే.. అంజలి విలన్ రోల్ చేయనుందన్నమాట. ఇది నిజమా? కాదా? అనేది ఇంకా తేలాల్సి ఉంది. వరుసగా వస్తున్న వార్తలతో బాలయ్య ఎన్బీకే108పై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ సినిమాలో డైరెక్టర్ అనిల్ రావిపూడి సైతం కామెడీ కంటే, యాక్షన్ కే పెద్ద పీట వేస్తున్నట్లు వార్తలు జోరందుకున్నాయి.
మరోవైపు.. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలోనే నడిచే కథతో ఊరమాస్ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా శ్రుతి హాసన్ నటిస్తోంది. ఈ దసరా పండుగకి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు మూవీ మేకర్స్. ఇక అనిల్ రావిపూడి తరువాత బాలకృష్ణ ఎవరితో సినిమా చేస్తాడు అనే విషయంపై కూడా బాలయ్య అభిమానుల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొంత మంది పేర్లు వినిపిస్తుండగా.. అందులో ముఖ్యంగా బీవీఎస్ రవి పేరు ముందు వరుసలో ఉంది. మొత్తం మీద బాలయ్య బాబు వరుసగా సినిమాలో లైన్లో పెట్టి బిజీబిజీగా మారారు.