కొత్త బంగారులోకం సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్. కానీ ఆ తర్వాత తన సినిమాలేవీ హిట్ కాకపోవటంతో పాటు సెక్స్ రాకెట్ కేసులో అరెస్ట్ అయ్యింది. ఆ తర్వాత బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్ ను పెళ్లాడినప్పటికీ, ఏడాది తిరక్కుండానే విడాకులిచ్చేసింది. ప్రస్తుతం చిన్న సినిమాల్లో నటిస్తోంది.
ఇండియా లాక్ డౌన్ అనే సినిమా చేస్తున్న శ్వేతాబసు… ఆమె సెక్స్ వర్కర్ గా నటిస్తోంది. లాక్ డౌన్ లో రెడ్ లైట్ ఏరియాల్లో ఉండే సెక్స్ వర్కర్స్ ఎలాంటి ఇబ్బందిపడ్డారో చూపించబోతున్నారు. దీంతో ఆ సమస్యలు తెలుసుకునేందుకు ముంబైలోని ఏరియాలకు వెళ్లానని తెలిపింది.
నేను చేసే క్యారెక్టర్ లో లీనమవుతాను. అందుకే వారి ఇబ్బందులను తెలుసుకునేందుకు తన టీం రెండు వారాల పాటు ముంబైలోని కామటిపురలోని రెడ్ లైట్ ఏరియాకు వెళ్లినట్లు తెలిపింది. ఆ పాత్ర యాస, ఇబ్బందులను స్క్రీన్ పైన కనపడేలా చూపలన్న ఉద్దేశంతోనే వెళ్లినట్లు తెలిపింది.