సీఎం జగన్ తో కలిసి వాన్ పిక్ భూముల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిమ్మగడ్డ ప్రసాద్ సెర్భియా దేశం నుండి బెయిల్ పై ఇండియాకు చేరుకున్నారు. రస్ అల్ ఖైమా ప్రభుత్వాన్ని వేల కోట్లు మోసం చేశారని నిమ్మగడ్డ పై ఆ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది.
గత ఏడాది జులైలో సెర్భియా వెళ్లిన నిమ్మగడ్డను అక్కడి పోలీసులు రస్ అల్ ఖైమా ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుండి జైల్లోనే ఉన్న నిమ్మగడ్డకు సెర్భియో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయటంతో… హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తోంది.
అయితే, అందరూ విదేశీ ప్రయాణికుల లాగానే… నిమ్మగడ్డను 14రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నారు. రెండు కరోనా వైరస్ టెస్ట్ లు చేసిన తర్వాత, కరోనా లేదని నిర్ధారించుకున్నాకే నిమ్మగడ్డను ఇంటికి పంపబోతున్నారు.
14రోజుల వైద్యుల పర్యవేక్షణలో ఉండే వారిని చూసేందుకు సంబంధిత వ్యక్తి కుటుంబ సభ్యులతో పాటు ఎవరినీ తెలంగాణ ప్రభుత్వం అనుమతించటం లేదు.