గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ నటించిన సినిమా క్రాక్. సంక్రాంతి రేసులో విజేతగా నిలిచిన సినిమా ఇది. మంచి కలెక్షన్లు రాబడుతున్న ఈ మూవీ హిందీలో రీమేక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నటుడు సోనూ సూద్ హిందీలోకి రీమేక్ చేయాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
పవర్ ఫుల్ పోలీసు అధికారి పాత్ర చేసిన రవితేజ క్యారెక్టర్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలని సోనూ సూద్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రీమేక్ రైట్స్ కోసం నిర్మాత ఠాగూర్ మధుతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇది ఓ తమిళ మూవీ కావటంతో ఆ నిర్మాత కూడా ఒప్పుకుంటేనే డీల్ ఓకే కానుంది.