ఈ మధ్య కాలంలో తెలుగులో విలన్ పాత్రలు బాగా హిట్ అవుతున్నాయి. గతంలో తమిళ సినిమాల్లో మాత్రమే విలన్ పాత్రలను చాలా అందంగా లేదంటే భయంకరంగా చూపించే వారు. అయితే భాషా సినిమా నుంచి కాస్త ఈ ట్రెండ్ మారింది. లేడీ విలన్ ల హవా కూడా బాగా పెరిగింది అనే చెప్పాలి. సరే గాని హీరో కంటే విలన్ పాత్రలు బాగుండే తెలుగు సినిమాలు ఒకసారి చూద్దామా…?
Also Read:పెళ్లిలో తాళిబొట్టు ఎంత పొడవు ఉండాలి…?
భాషా:
ఇది తమిళ సినిమానే అయినా తెలుగులో కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమాలో రఘువరన్ నటనకు అందరూ ఫిదా అయిపోయారు. పాత్రను ఆయన పోషించిన విధానం మాత్రం చాలా బాగుంటుంది.
నరసింహ
రజనీ కాంత్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఎటువంటి సంచలనాలు నమోదు చేసిందో తెలిసిందే. ఈ సినిమాలో నీలాంభరి అదేనండి రమ్య కృష్ణ నటన మాత్రం రజనీ కాంత్ తో పోటీ పడి చేయడంతో బాగా హిట్ అయింది. నరసింహ సినిమా అంటే ఇప్పటికి కూడా ఆమెనే గుర్తు వస్తుంది.
వర్షం
ఈ సినిమాలో గోపి చంద్ నటన మరో రేంజ్ లో ఉంటుంది. కథ ఆయన కోసమే రాసారా అన్నట్టు ఉంటుంది. అదే తరహాలో జయం, నిజం సినిమాల్లో కూడా గోపి చంద్ నటించారు.
సింహాద్రి
ఈ సినిమాలో ముకేష్ రుషి నటన కూడా చాలా బాగుంటుంది. ఆయన రాయల్టీ సినిమాకు హైలెట్ అవుతుంది.
జల్సా
ఈ సినిమాలో కూడా ముఖేష్ ఋషీ నటన సినిమాకు అందం తీసుకొచ్చింది. సినిమాలో ఆయన కాకుండా మరో విలన్ అయితే సినిమా ఫ్లాప్ అనే రేంజ్ లో నటించారు.
పోకిరి
ఈ సినిమాలో మహేష్ బాబు నటనకు ఎంత మంచి పేరు వచ్చిందో ప్రకాష్ రాజ్ నటనకు కూడా అదే రేంజ్ లో పేరు వచ్చింది. అలీ భాయ్ గా ఆయన ఎంతో అద్భుతంగా నటించి మెప్పించారు.
అరుంధతి
ఈ సినిమాలో అనుష్క నటనకు మంచి మార్కులు పడినా సోను సూద్ కే సినిమా పండితులు ఓటు వేసారు. ఆ పాత్ర ఎవరు చేసినా సరే సినిమా కచ్చితంగా ఫ్లాప్ అనే రేంజ్ లో ఉంటుంది.
లెజెండ్
జగపతి బాబు కెరీర్ ను మార్చిన సినిమా ఇదే. ఈ సినిమాలో ఆయన పాత్ర బాగా హైలెట్ అయింది. విలన్ గా మంచి నటనతో ఆకట్టుకోవడమే కాకుండా ఆయన ఫిజిక్ మరోసారి లేడీ ప్రేక్షకులను ఫిదా చేసింది.
బాహుబలి
ఈ సినిమాలో రానా నటనకు మంచి మార్కులు పడ్డాయి. రాజమౌళి ఆలోచనకు తగిన విధంగా ఆయన నటించిన నటనకు జనాలు ఫిదా అయిపోయారు.
టెంపర్
ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆయన పాత్ర దారుణంగా ఉన్నా సరే నటన పరంగా బాగా ఆకట్టుకున్నారు.
ధ్రువ
ఈ సినిమాలో అరవింద్ స్వామి నటన కోసమే చాలా మంది సినిమాకు వెళ్ళారు. రామ్ చరణ్ బాగా నటించినా స్టైలిష్ విలన్ గా అరవింద్ స్వామి నటించిన నటన మాత్రం సినిమాకు హైలెట్ అయింది.
ఉప్పెన
ఈ సినిమాలో విజయ్ సేతుపతి నటన మరో రేంజ్ లో ఉంటుంది. అసలు సినిమా కథ ఆయన్ను ఊహించుకుని రాసినట్టే ఉంటుంది. హీరోయిన్ తండ్రిగా ఆయన పోషించిన పాత్రతో తెలుగులో ఆయనకు డిమాండ్ పెరిగింది.
ఇలా చూసుకుంటే అతడులో సోను సూద్, భిమ్లా నాయక్ లో రానా విలన్ లుగా బాగా ఆకట్టుకున్నారు.
Also Read:విజయవాడ అత్యాచార ఘటనలో.. ఇద్దరు పోలీసులు సస్పెండ్