కేంద్ర బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు మరోసారి మొండి చెయ్యే ఎదురైంది. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఉండటంతో గత మూడేళ్లుగా కనీసం ఈసారైనా అత్తింటి తెలుగు నేలకు కాస్తయిన నిధులు కేటాయించకపోదా అని అంతా అనున్నారు. ఎన్నికల సమయంలో పుట్టినిల్లు తమిళనాడుపై వరాల జల్లు కురిపించగా, ఎప్పట్లాడే తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి చూపించింది. దక్షిణాధిలో కేరళ, తమిళనాడుకు భారీ నిధులిచ్చారు.
చెన్నై మెట్రో రైలు విస్తరణకు ఏకంగా63, 246 కోట్లు కేటాయించారు. బెంగళూరు మెట్రోకు 14,788 కోట్లు కేటాయించారు. కానీ తెలంగాణలో మెట్రో విస్తరణ పేరే ఎత్తలేదు. ఇక మెట్రో రైలు అనేదే లేని ఏపీని పూర్తిగా మర్చారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జాతీయ రహదారులను నిర్మించేందుకు బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేయగా, తెలుగు రాష్ట్రాల ఊసే ఎత్తలేదు.
కేవలం ఎన్నికలున్న రాష్ట్రాలకే బడ్జెట్ పెట్టినట్లుంది అంటూ కేంద్ర బడ్జెట్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.