బ్రహ్మానందం… ఈ పేరు తెలియని తెలుగు సినిమా ప్రేక్షకుడు ఉండరు అనటంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. స్టార్ హీరోలు సైతం బ్రహ్మానందం కోసం వెయిట్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా…
కానీ బ్రహ్మానందం పరిస్థితి మరీ ఘోరంగా తయారైందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే బ్రహ్మానందంకు ఈ మధ్య సినిమాలు తగ్గిపోయాయన్నది నిజం. చిన్న చిన్న సినిమాల్లోనూ అక్కడక్కడ కనిపిస్తున్నారు. ఒకప్పుడు హీరోకు సమానంగా క్యారెక్టర్ చేసిన బ్రహ్మానందం పరిస్థితి మరీ తీసిపోయిందని బాధపడుతున్నారు చాలా మంది.
అయితే, బ్రహ్మానందం ఓ తాజా ఫోటోను డైరెక్టర్ కృష్ణవంశీ షేర్ చేశారు. తన తదుపరి చిత్రంలో బ్రహ్మానందం ఉన్నారు అని చెబుతూ పెట్టిన ఫోటో బ్రహ్మానందం అభిమానులను కంటతడి పెట్టిస్తుంది.