తెలుగులో ప్రముఖ ప్రొడ్యూసర్లలో దిల్ రాజు ఒకరు. సక్సెస్ ఫుల్ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా ఆయను మంచి పేరుంది. అయితే… దిల్ రాజు భార్య అనారోగ్యం కారణంగా 2017లో మరణించారు. నాటి నుండి ఒంటరిగానే ఉంటున్న దిల్ రాజు మరోసారి పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త కొంతకాలంగా చక్కర్లు కొడుతూనే ఉంది.
అయితే… లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డ ఈ పెళ్లి ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యుల మధ్య జరగబోతుందని తెలుస్తోంది. కేవలం కొద్దిమందితో రెండు కుటుంబాలకే పరిమితం చేస్తూ నిజామాబాద్ లోని వెంకటేశ్వర స్వామి గుడిలో వివాహాం జరగబోతుందని ప్రచారం సాగుతోంది. ఈ గుడిని దిల్ రాజు కుటుంబ సభ్యులే నిర్మించటంతో అదే సెంటిమెంట్ తో అక్కడ వివాహం జరగబోతుంది. ఇందుకోసం ఇప్పటికే రెండు కుటుంబాలు నిజామాబాద్ చేరుకున్నాయి.
దిల్ రాజు వివాహం చేసుకోబోయే వారు 35 ఏళ్ల ఎయిర్ హోస్టెస్ అని, విశాఖపట్నంకు చెందిన బ్రహ్మణ మహిళ అన్న ప్రచారం జరిగింది. అయితే ఇది అధికారికంగా మాత్రం చేయలేదు. కానీ సోమవారం రెండో వివాహంపై దిల్ రాజు ప్రకటన చేసే అవకాశం ఉంది.
అయితే… దిల్ రాజు విషయాన్ని బయటకు చెప్పకుండా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ నోట్ ఇదే…