తెలుగు సీఎంల ప్రత్యేక భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. సెప్టెంబర్ తర్వాత ఇద్దరు సీఎంల మధ్య గ్యాప్ వచ్చినట్లు ప్రచారం జరిగిన తర్వాత తొలి భేటీ కావటంతో వీరిద్దరు ఏం చర్చించుకుంటారు, ఏపీలో రాజధాని ఉద్యమం ఉదృతంగా నడుస్తున్న సమయంలో ఉద్యమ నాయకుడితో భేటీపై ఆసక్తి నెలకొంది.
ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న పెండింగ్ నిధులు, ఉద్యోగుల విభజన, ఉమ్మడి సంస్థల పంపకంపై భేటీ జరుగుతుందని ఇరు రాష్ట్రాల సీఎంవోల ప్రకటన. కానీ అధికారులు ఎవరూ లేకుండా… సంక్రాంతి పండుగ ముందు రోజు జరుగుతున్న ఈ భేటీ రాజకీయ ప్రాధాన్యత ఉన్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఒక ఉద్యమ నాయకుడిగా ఉద్యమాలను ఎలా హ్యండిల్ చేయాలో కేసీఆర్‌కు బాగా తెలుసు. పైగా టీడీపీని పూర్తిగా దెబ్బకొట్టేందుకు రాజధాని అంశం ఎలా ఉపయోగించుకోవాలి, గతంలో తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర వేసి టీడీపీని తెలంగాణలో ఎలా బలహీనం చేశారు, ఇప్పుడు విశాఖకు రాజధాని రాకుండా అడ్డు అని ఎలా ముందుకెళ్లాలో ఇద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక బీజేపీతో సత్సంబంధాల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం లేకపోలేదని… ఇది రాజకీయ ప్రాధాన్యత ఉన్న భేటీయేనని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.