తెలుగు రాష్ట్రాల సీఎస్ లు గురువారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో సమావేశమవ్వనున్నారు. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ల భేటీ అనంతరం ఇరు రాష్ట్రాల సీఎస్ లు సమావేశం అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి పలువురు ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ప్రధానంగా విభజన సమస్యలతోపాటు, గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు అందించే విషయమై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే 9, 10 షెడ్యూల్‌లోని అంశాలను పరిష్కరించుకునే దిశగా చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది.