కేజిఎఫ్ 2 తెలుగు రైట్స్ పై నిర్మాతలు పోటాపోటీ.. - Tolivelugu

కేజిఎఫ్ 2 తెలుగు రైట్స్ పై నిర్మాతలు పోటాపోటీ..

కేజిఎఫ్ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయిన హీరో యాష్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజిఎఫ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్ ను సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేజిఎఫ్ కు సిక్వెల్ గా కేజిఎఫ్ 2 ను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతుందట. తెలుగు రైట్స్ విషయానికి వస్తే తెలుగులో రిలీజ్ చెయ్యటానికి సాయి కొర్రపాటి ఎక్కువగా ఆశక్తి చూపిస్తున్నారట. దీనికి గాను 20 కోట్ల దాకా డబ్బింగ్ రైట్స్ కి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అయితే ‘కేజీఎఫ్ 2’ మేకర్స్ మాత్రం 40 నుండి 50 కోట్ల వరకు తెలుగు రైట్స్ అమ్మాలని అనుకుంటున్నారట. ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం ఇప్పటికే దిల్ రాజు మరియు ఏషియన్ సినిమాస్ సునీల్ కూడా ట్రై చేస్తున్నారని తెలుస్తుంది.

Share on facebook
Share on twitter
Share on whatsapp