యూట్యూబ్… మొబైల్ వాడకం ఎంత పెరిగిందే యూట్యూబ్ వినియోగం కూడా అంతే పెరిగింది. ముఖ్యంగా ఇంటర్నెట్ సేవలు అతి తక్కువ ధరకే రావటం మొదలైనప్పటి నుండి యూట్యూబ్ వాడకం పెరిగ్గా.. ఇండియాలో ఎక్కువగా యూట్యూబ్ వీడియోలు చూసేది ఎక్కువగా తెలుగువారేనని ఓ సంస్థ కథనాన్ని ప్రచురించింది.
SBI కొత్త నిబంధనలు జనవరి 1 నుండే
2012లో సగటున 2 నిమిషాలు మాత్రమే వీడియోలు చూసేవారట కానీ ఇప్పుడు 67 నిమిషాలకు చేరిందని, యూట్యూబ్ తర్వాత హాట్‌స్టార్, జియో టీవీ, ప్రైమ్ వీడియోలు ఉన్నట్లు తెలిపింది. అయితే… ఈ తేడాకు జియో కూడా కారణమని చెప్పవచ్చు. జియో రాకతో ఇంటర్నెట్ చౌకగా రావటంతో యూజర్లు వీడియోలను ఎక్కువగా చూసినట్లు తెలుస్తోంది.
మహేష్ అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడా…?
ప్రాంతీయ భాషల్లో తెలుగు వీడియోలకు అత్యధిక డిమాండ్ ఉన్నట్లు విడోలి సంస్థ ఓ నివేదిక ఇచ్చింది. తెలుగు వీడియోలకు ఆధరణ ఎక్కువగా ఉందని, యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయ్యే వీడియోల్లో తెలుగువే ఎక్కువగా ఉంటున్నాయని తెలిపింది. తెలుగు తర్వాత తమిళ్, పంజాబీ, మలయాళీ, భోజ్‌పురి భాషల వీడియోలున్నాయి. అయితే… 5జీ వస్తే డేటా వినియోగం పెరగటంతో పాటు వీడియోలు చూడటం కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. గత రెండు సంవత్సరాలలో తెలుగులో వీడియోలు చూసిన వారు సంఖ్య 1270కోట్ల నుండి 6740కోట్లకు చేరటం విశేషం.