బీకేర్ ఫుల్ ..! భానుడి భగభగలు స్టార్ట్ అయ్యాయి. ఫిబ్రవరి నెల పూర్తి కాకముందే దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్రలోని కొంకణ్, గోవా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో 35 నుంచి 39 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోవడంతో.. జనాలు ఆందోళనకు గురవుతున్నారు. మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో వేడి గాలులు తీవ్రంగా వీచే అవకాశం ఉందని ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.
ఈ క్రమంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నప్పటికీ..త్వరలోనే తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపింది. 4 నుంచి 9 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.