గుంటూరు: రాష్ట్రవ్యాప్తంగా 28 దేవాలయాలలో పాలక మండళ్ల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కోటి నుంచి ఐదు కోట్లు, అలాగే ఐదు నుంచి 20 కోట్లు వార్షికాదాయం ఉన్న అన్ని దేవాలయాలకు పాలక మండళ్ల ఏర్పాటుకు అనుమతిస్తూ దేవాదాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. హిందూ ధార్మిక సంస్థలు, ట్రస్టుల చట్టం 1987 నూతన సవరణ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 28 ప్రముఖ దేవాలయాలకు పాలక మండళ్లను ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ఈ నోటిఫికేషన్ జారీ అయ్యింది.
శ్రీకాకుళంలోని అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం, నెల్లిమర్లలోని రామస్వామి ఆలయం, విశాఖ జిల్లా అనకాపల్లి నూకాంబికా ఆలయం, కాకినాడలోని ఎం.ఎస్.ఎన్ ఛారిటీస్ సంస్థకు, అంతర్వేదిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం, తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలోని మండేశ్వరస్వామి ఆలయం, వడ్డేపల్లిలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం, పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వరస్వామి ఆలయం, గుంటూరు లాలాపేటలోని జగన్నాధ, ఆంజనేయ, వెంకటేశ్వర ఆలయం, అదిగొప్పలలోని నిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారి ఆలయం, మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం, అమరావతిలోని అమరేశ్వరస్వామి ఆలయం, మాలకొండలోని మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామి, ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం, ఒంగోలులోని ప్రసన్న చెన్నకేశవ ఆలయం, టంగుటూరులోని వల్లూరమ్మ అమ్మవారి ఆలయం, మిట్టపాలెంలోని శ్రీనారాయణ స్వామి ఆలయం, నెల్లూరు జిల్లా జొన్నవాడలోని మల్లిఖార్జున కామాక్షి తాయి ఆలయం, దుర్గామిట్టలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం, సూళ్లురుపేటలోని చెంగాళ్లమ్మ పరమేశ్వరి ఆలయం, నర్రవాడలోని వెంగమాంబ పేరంటాళ్లమ్మ ఆలయం, మత్యాలమ్మ ఆలయం, రాయచోటిలోని వీరభద్రస్వామి ఆలయం , చిత్తూరులోని అరగొండ ఆర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయం, తిరుపతిలోని తాతయ్య గుంట గంగానమ్మ వారి ఆలయం, అనంతపురం జిల్లా వెంటికటి ఆంజనేయుని ఆలయం, అనంతపురం జిల్లా కదిరి లక్ష్మి నరసింహాలయం, చిత్తూరు జిల్లా దిగువపల్లి బోయకుంట గంగమ్మాలయం పాలక మండళ్ల ఏర్పాటుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.