ప్రకృతి సోయగాల నిలయమైన విశాఖ ఏజెన్సీని చలి వణికిస్తోంది. అక్కడ రోజు రోజుకు ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఉదయం పది గంటల వరకు కూడా విశాఖ ఏజెన్సీ అంతా మంచు దప్పటిలో బందీ అవుతోంది.
ఈ సీజన్‌లో అత్యల్పంగా మినుములూరులో 7, చింతపల్లిలో 8.4, పాడేరులో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకావడంతో అక్కడి ప్రజలు చలికి తట్టుకోపోతున్నారు. విశాఖ ఏజెన్సీలో సముద్రమట్టానికి మూడువేల పైచిలుకు అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయి గిరిజనులు చలికి గజగజ వణికిపోతున్నారు. వారం రోజుల క్రితం వరకు ఒక మోస్తారుగా ఉన్న చలి తీవ్రత శుక్రవారం ఒక్కసారిగా పెరిగింది.