మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన పోకిరి సినిమా అంటే ఫాన్స్ లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ సినిమా అప్పట్లో ఒక సంచలనం అనే చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ఆలోచన కూడా దాదాపుగా మారింది అనే టాక్ ఉంది. ఇక అప్పట్లో పోకిరి సెట్ చేసిన రికార్డులు ఒకసారి చూద్దాం.
ఎందరో హీరోలను పూరి హీరోలుగా అనుకున్నారు. కాని మహేష్ బాబు లాంటి హీరోను తీసుకుని మూడు నెలల్లో సినిమాను పూర్తి చేసాడు.
1 పోకిరి అప్పట్లో కలెక్ట్ చేసిన గ్రాస్ 66.50 కోట్లు అలాగే నెట్ షేర్ 48.28 కోట్లు. అప్పటి వరకు ఏ సౌత్ ఇండియా సినిమా ఆ రేంజ్ లో వసూలు చేయలేదు.
2. పోకిరి అప్పట్లో ఎక్కువ గ్రాస్ వసూలు చేసిన రెండో సినిమాగా నిలిచింది. ఈ సినిమా తర్వాత తెలుగు సినిమా వైపు బాలీవుడ్ ఎక్కువగా చూడటం మొదలుపెట్టింది.
3. 200 ల సెంటర్లలో వంద రోజులు పూర్తి చేసుకుంది ఈ సినిమా. 63 సెంటర్లలో 175 రోజులు పూర్తి చేసుకుని సంచలనం సృష్టించింది. 15 సెంటర్లలో 200 రోజులు పూర్తి చేసుకుంది.
4. మహేష్ బాబు ఫాన్స్ ఎక్కువగా ఉండే కర్నూలు జిల్లాలో ఏకంగా ఏడాది పాటు ఒక థియేటర్ లో ఆడింది ఈ సినిమా. భాగిరథ థియేటర్ లో 500 రోజుల పాటు సినిమా ఆది సంచలనం సృష్టించింది. ప్రేమాభిషేకం తర్వాత పోకిరి సినిమానే అన్ని రోజులు ఆడింది ఆ జిల్లాలో.
5. తనకు మాత్రమే సొంతమైన ఎన్నో రికార్డులను పోకిరి సొంతం చేసుకుంది. 200 రోజుల పాటు సినిమాను రోజుకి 5 సార్లు ప్రదర్శించారు.
6. ఆ సమయంలో హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ 1.60 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఉమ్మడి ఏపీలో ఒక సినిమా అలా వసూలు చేయడం అదే సంచలనం.
7. ఆ సమయంలో పోకిరి హైదరాబాద్ లో మూడు థియేటర్ లలో కోటి పైగా వసూలు చేసింది. విశ్వనాథ్, మెగా థియేటర్ లో కూడా కోటి పైగా వసూలు చేసింది. ప్రసాద్ లో 98 లక్షలు వసూలు చేసింది.
8. నాలుగు రాష్ట్రాల్లో అంటే తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్రలో ఎన్నో థియేటర్ రికార్డులను తన సొంతం చేసుకుంది పోకిరి.
9. నైజాం లో ఈ సినిమా దాదాపు 11 కోట్లు వసూలు చేసింది. ఇంద్రా తర్వాత అప్పట్లో ఆ రేంజ్ లో వసూలు చేసింది ఈ సినిమానే.
10. అమెరికాలో పోకిరి రెండున్నర కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమానే అప్పట్లో ఎక్కువ వసూలు చేసిన సినిమా మన సౌత్ నుంచి.