తిరుమలలో కొండ చిలువ అందర్నీ హడలెత్తించింది. జీఎన్సీ టోల్ గేట్ సమీపంలోని దివ్యరామం నర్సరీలో సుమారు పది అడుగుల పొడవున్న భారీ కొండచిలువ పూల కుండీల మధ్యలో కనిపించింది. గార్డెన్ సిబ్బంది దాన్ని చూసి పరుగులు పెట్టారు.
అయితే.. ఓ పారిశుద్ధ్య కార్మికుడు కొండ చిలువను చాకచక్యంగా బయటకు తీశాడు. ఓ సంచిలో వేసి అవ్వాచారికొనలో వదిలి పెట్టాడు. దీంతో గార్డెన్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కొండ చిలువను చూసేందుకు యాత్రికులు భారీగా రావడంతో ఆ ప్రాంతంలో కాసేపు రద్దీ కనిపించింది. కొండ చిలువను వీడియోలు తీసేందుకు ఉద్యోగులు, యాత్రికులు ఉత్సాహం చూపించారు.