చాలా మంది హీరోలు తమ వద్దకు వచ్చిన కథలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే అదే కథతో వేరొక హీరోలు మాత్రం సూపర్ డూపర్ హిట్స్ ని అందుకుంటారు. అయితే అలా నందమూరి బాలకృష్ణ వదులుకున్న బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా విక్టరీ వెంకటేష్ నటించిన చంటి…ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నటుడిగా వెంకటేష్ కు ఎంతో పేరును తీసుకువచ్చింది. కానీ నిజానికి దర్శకుడు నందమూరి బాలకృష్ణ తో ఈ సినిమా చేయాలని అనుకున్నాడట. కానీ బాలయ్యకు కథ నచ్చక పోవడంతో రిజెక్ట్ చేశారు. అలాగే సింహరాశి ఈ సినిమాని కూడా బాలయ్య చేయాల్సి ఉండగా ఆయన రిజెక్ట్ చేయడం తో రాజశేఖర్ చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది.

అలాగే వెంకటేష్ సూర్యవంశం, జగపతిబాబు శివరామరాజు, పవన్ కళ్యాణ్ అన్నవరం సినిమాలు కూడా బాలకృష్ణ చేయాల్సి ఉందట. కానీ ఆయన రిజెక్ట్ చేశాడు. అలాగే నాగార్జున హీరోగా వచ్చిన జానకి రాముడు కథ కూడా మొదట బాలయ్యకు చెప్పారట. కానీ ఆయన చేయకపోవడంతో నాగార్జున చేశాడు.
ఎన్టీఆర్ లాంటి నేత మళ్లీ రాకపోవచ్చు!!
అలాగే బాడీగార్డ్, సింహాద్రి, రవితేజ క్రాక్ కూడా బాలకృష్ణ చేయాల్సి ఉందట. కానీ ఆయన వివిధ రకాల కారణాలతో నో చెప్పడంతో వేరే హీరోలు చేశారు. అయితే ఇందులో ఒకటి రెండు మినహా మిగతావన్నీ హిట్ కావడం గమనార్హం.
ఇలా చేస్తే… వచ్చేవాడు నీ కూతుర్ని వదిలి నిన్ను చేసుకుంటాడు!!
ఇక గత ఏడాది అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో 107వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తరువాత అఖండ2 ని తీసేందుకు ప్లాన్ చేస్తున్నాడు బాలయ్య.