సినిమా పరిశ్రమలో టాలెంట్ ఉండి… బ్యాక్ గ్రౌండ్ ఉంటే మాత్రం ఇక వాళ్ళ కెరీర్ గురించి ఆలోచించే అవసరం ఉండదు. స్టార్ హీరోలుగా ఒక వెలుగు వెలిగిపోతూ ఉంటారు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు గా చేసే వాళ్లకు కూడా మంచి పేరు వస్తు ఉంటుంది. అలా వచ్చి స్టార్ లు అయిన వాళ్ళ లిస్టు కూడా ఎక్కువగానే ఉంది. అలా స్టార్ లు అయిన వాళ్ళ లిస్టు ఒకసారి చూస్తే…
Also Read:భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ అందుకే మాట్లాడలేదా ?
విజయ్ దేవరకొండ
అర్జున్ రెడ్డి సినిమా తర్వాత స్టార్ హీరోగా మారిన ఈ హీరో… రవిబాబు దర్శకత్వంలో వచ్చిన నువ్విలా సినిమాలో… శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిపుల్ సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేసాడు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నానీ పక్కన ఫ్రెండ్ గా చేసాడు.
సాయి పల్లవి
సౌత్ లో ఈ అమ్మాయికి ఫుల్ క్రేజ్ ఉంది. ఫిదా సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టి… మీరా జాస్మిన్, విశాల్ కాంబినేషన్ లో వచ్చిన పందెం కోడి సినిమాలో హీరోయిన్ కి ఫ్రెండ్ గా చేసింది. తర్వాత డాక్టర్ చదువు కోసం ఆస్ట్రియా వెళ్ళింది. సినిమాలు లేకపోయినా సరే డాక్టర్ గా కెరీర్ లో ముందుకు వెళ్తా అంటుంది.
త్రిష
వర్షం సినిమాతో తెలుగు స్క్రీన్ పై కనపడిన త్రిష… రెండు దశాబ్దాలు అయినా సరే కెరీర్ లో స్పీడ్ గా ముందుకు వెళ్తుంది. జోడి సినిమాలో ఆమె సిమ్రాన్ కు ఫ్రెండ్ గా నటించింది.
రవి తేజా
వెనుక ఎవరి సపోర్ట్ లేకపోయినా సరే స్టార్ హీరోగా వచ్చారు రవి తేజా. డైరెక్టర్ అవ్వాలని భావించి వచ్చి… అసిస్టెంట్ డైరెక్టర్ గా సినిమాలు చేస్తూ చిన్న చిన్న పాత్రలు పోషించాడు. అల్లరి ప్రియుడు సినిమాలో రాజశేఖర్ పక్కన ఫ్రెండ్ గా నటించాడు. ఇక కొన్ని సినిమాల్లో నెగటివ్ పాత్రలు కూడా చేసాడు.
కాజల్
హింది సినిమా క్యూ హో గయా ణా లో ఐశ్వర్య రాయ్ కు ఫ్రెండ్ గా నటించింది. లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది.
రీతు వర్మ
పెళ్లి చూపులు సినిమాతో హీరోయిన్ గా వచ్చిన రీతు… ఎన్టీఆర్ హీరోగా వచ్చిన బాద్షా సినిమాలో కాజల్ కు చెల్లిగా నటించింది.
శర్వానంద్
టాలెంట్ ఉన్నా సరే సరైన హిట్స్ రాక ఇబ్బంది పడుతున్న శర్వానంద్… యువసేన సినిమాలో నలుగురు హీరోల్లో ఒకడిగా చేసాడు. ఎన్నో సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ కూడా చేసాడు.
విజయ్ సేతుపతి
తమిళ హీరో విజయ్ సేతుపతికి ఉప్పెన సినిమా తర్వాత తెలుగులో డిమాండ్ పెరిగింది. పిజ్జా, నేను రౌడీ లాంటి డబ్బింగ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 96 సినిమా తర్వాత ఆయనకు డిమాండ్ పెరిగింది. ధనుష్, కార్తీ, జయం రవి లాంటి హీరోల సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసాడు.
నవీన్ పోలిశెట్టి
ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా ద్వారా హీరోగా వచ్చిన నవీన్… తెలుగులో లైఫ్ ఈజ్ బ్యూటిపుల్ సినిమాలో నటించాడు. విజయ్ దేవరకొండకు ఫ్రెండ్ గా కనిపించాడు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సినిమా చిచోరేలో కూడా నటించాడు.
సత్యదేవ్
2011 లో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో చిన్న పాత్ర చేసాడు. ఆ సినిమాలో అతను ఉన్నాడు అని కూడా ఎవరికి తెలియదు. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
అనసూయ
టాలీవుడ్ లో ఇప్పుడు ఈమె పేరు బాగా వినపడుతుంది. రంగమ్మత్తగా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన నాగ సినిమాలో స్టూడెంట్ గా నటించింది.
Also Read:ఉక్రెయిన్ వైమానిక స్థావరాలు ధ్వంసం.. రష్యా ప్రకటన