‘మీరు నిజాన్ని ఆపలేరంటూ’ భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత కొన్ని రోజులుగా సానియా మీర్జా, ఆమె భర్త షోయబ్ మాలిక్ విడాకులు తీసుకుంటున్నారన్న వార్తలు నెట్టింట గుప్పుమన్నాయి. అందుకు సంబంధించిన వార్తలు తెగ వైరల్ అయ్యాయి.
12 ఏళ్ల క్రితం వివాహ బంధంతో ఒకటైన ఈ జంట.. విడాకుల రూమర్లపై ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాజాగా సానియా ఈ విషయంపై ఇన్ స్టాగ్రామ్ లో ఇన్ డైరెక్ట్ గా రియాక్ట్ అయింది. ‘మీరు నిజాన్ని ఆపలేరు’ అంటూ ట్వీట్ చేసింది.
దాంతో పాటు 2022 కోసం తన దగ్గర సుధీర్ఘమైన, లోతైన క్యాప్షన్ లేదన్న ఆమె.. కానీ తన వద్ద అందమైన సెల్ఫీలున్నాయని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె అందరికీ న్యూఇయర్ విషెస్ తెలియజేసింది.
2022లో తనపై వివాదాస్పద కామెంట్లు చేసినా.. తాను మాత్రం కృతజ్ఞతగానే ఉన్నానని సానియా చెప్పారు. ఈ క్యాప్షన్ తో పాటు బ్లాక్ కలర్ క్యాప్ అండ్ టీ షర్ట్ ధరించి ఉన్న ఓ సెల్ఫీని షేర్ చేశారు. దీంతో ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
View this post on Instagram