
టెన్నిస్ గ్లామర్ స్టార్ సానియా మీర్జా వివాహం, మాతృత్వం గ్యాప్ తర్వాత మళ్ళీ అంతర్జాతీయ టోర్నీకి రెడీ కావాలంటే అంత ఈజీ కాదు. ఎంతో కష్టపడాలి. కసరత్తులు చేయాలి. ఇప్పుడు జిమ్ లో సానియా అదేపనిలో ఉన్నారు. రీఎంట్రీకి సానియా కష్టపడుతున్న వీడియో ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. 4 నెలల్లో సానియా ఏకంగా 26 కేజీల బరువు తగ్గిందట. అంతగా వెయిట్ లాస్ కావాలంటే జిమ్ లో ఎంత శ్రమించిందో ! ఏకాగ్రత, నిబద్దత, శ్రమతోనే ఇది సాధ్యమైందట.
పిల్లల్ని కన్న తర్వాత బరువు తగ్గడం అంత సులువు కాదని చాలా మంది మెసేజ్ లు ఇచ్చారట. వారందరికీ ఇదే నా సమాధానం అంటూ సానియా నేను సాధించాను.. మీరూ సాధించగలరు అని హితవు పలికారు. రోజూ రెండు గంటలు జిమ్ లో కష్టపడితే అద్భుతాలు చూస్తారని వీడియోలో సానియా కామెంట్.
సానియా 2017లో చైనా ఓపెన్ లో చివరిసారిగా ఇండియా తరఫున టెన్నిస్ ఆడింది. ఇప్పుడు కసరత్తులు చేస్తూ 2020 జనవరి నాటికి అంతర్జాతీయ టోర్నీలో పాల్గొంటానని ఆత్మవిశ్వాసంతో చెబుతోంది.