కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పెరుగుతున్న ధరలు, రాష్ట్రంలో నెలకొన్న వరి ధాన్యం సమస్యలను నిరసిస్తూ.. టీపీసీసీ ఇచ్చిన పిలుపుతో నియోజకవర్గంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఈ దర్నాకు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు డాక్టర్.కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు.
కాగా.. ధర్నాలో పాల్గొన్న నిరసన కారులను స్థానికి పోలీసులు అడ్డుకున్నారు. నిరసన కారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలపై దాడికి దిగారు. దీంతో పోలీసులకు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది.
పోలీసుల దాడిలో కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు.. పలువురికి గాయాలయ్యాయి. సత్యనారాయణ మోకాలు వద్ద తీవ్ర గాయం అయింది. గాయంతో బాధపడుతున్న అతన్ని కరీంనగర్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పోలీసులు టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలుగా పని చేస్తున్నారని సత్యనారాయణ ఆరోపించారు. కావాలనే ఉద్ధేశ్యపూర్వకంగానే తమపై దాడి చేశారని ఆరోపించారు. రైతుల కోసం, పెరిగిన ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రంలోని సామన్య ప్రజలకోసం పోరాడుతున్న తమపై దాడికి పాల్పడటం హేయమైన చర్య అని విమర్శలు గుప్పించారు సత్యనారాయణ.