రాజ్ భవన్ ముట్టడికి పలు విద్యార్థి సంఘాలు ఈ రోజు ప్రయత్నించాయి. యూని వర్సిటీ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లుకు గవర్నర్ వెంటనే ఆమోదం తెలపాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. గవర్నర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి.
యూనిర్సిటీ రిక్రూట్ మెంట్ బిల్లుకు ఆమోదం తెలపాలని కోరుతూ బీఆర్ఎస్‌వీ,ఇతర విద్యార్థి సంఘాలు రాజ్ భవన్ ఎదుట బైఠాయించాయి. గవర్న్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశాయి. ఈ క్రమంలో రాజ్ భవన్ వద్ద ఉద్రికత్త పరిస్థితి నెలకొంది.
దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి వారిని బలవంతగా లాక్కెళ్లి అరెస్టు చేశారు. ఈ సందర్బంగా విదార్థి సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ… రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లును గవర్నర్ పెండింగ్‌లో పెట్టడంతో 3వేల ప్రొఫెసర్ పోస్టులు పెండింగ్ లో వున్నాయని అన్నారు.
సుమారు ఎనిమిది కీలకమైన బిల్లులు గవర్నర్ తమిళిసై వద్ద పెండింగ్‌లో వున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై వెంటనే విచారణ జరపాలని సుప్రీం కోర్టును రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ పిటిషన్ పై సీజేఐ నేతృత్వంలోని బెంచ్ సోమవారం విచారణ చేపట్టనుంది.
గవర్నర్ వద్ద పెండింగ్ లో వున్న బిల్లుల్లో యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లు, ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను అటవీ వర్సిటీగా అప్‌గ్రేడ్ చేసే బిల్లు, జీఎస్టీ చట్ట సవరణ, ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ, మున్సిపల్ చట్ట సవరణ, పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట సవరణ, ప్రైవేటు యూనివర్సిటీ సవరణ బిల్లు, మోటర్ వెహికిల్ టాక్సేషన్ సవరణ బిల్లు వున్నాయి.