అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాసరి కిరణ్ అనే వ్యక్తి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి భార్య ఇసుక ట్రాక్టర్లకు డబ్బు డిమాండ్ చేస్తోందంటూ కామెంట్స్ చేశారు. దీనిపై పెద్దారెడ్డితో పాటు ఆయన వర్గీయులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇసుక ట్రాక్టర్లకు డబ్బులు చేస్తున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కిరణ్… జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఉన్నాడని సమాచారం అందుకున్న పెద్దారెడ్డి నేరుగా తన అనుచరులతో కలసి జేసీ ఇంటికి వెళ్లాడు. జేసీ ఇంట్లో కిరణ్ పై దాడి చేశారు. అయితే ఈ సమయంలో జేసీ బ్రదర్స్ కాని వారు కుటుంబసభ్యులు ఎవరూ లేరు. విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈ సంఘటనతో తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.