బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జగిత్యాల పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. సంజయ్ పర్యటనకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ సర్పంచులు ఆందోళనకు దిగారు. ఆందోళన చేస్తున్న టీఆర్‌ఎస్ నేతలను అరెస్ట్ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులతో బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.