హైదరాబాద్ లోని కాప్రా డివిజన్ జమ్మిగడ్డలో ఉద్రిక్తం వాతావరణం నెలకొంది. గురువారం ఉదయం జమ్మిగడ్డలోని స్మశానవాటిక సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి శాంతియుత వాతావరణంలో దీక్షకు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకున్నారు. దీక్ష శిబిరాలను దౌర్జన్యం తొలగించారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించకుండా శాంతియుతంగా నిరసన చేస్తాం అని చెబుతున్నప్పటికీ.. పోలీసులు వినిపించుకోకుండా దౌర్జన్యంగా కార్పొరేటర్ శిరీష, ఆమె భర్త సోమశేఖర్ రెడ్డిలను జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల తీరు పట్ల మహిళలు విరుచుకుపడ్డారు.
అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన దిగారు.. ఆందోళన కారులను కూడా బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేశారు పోలీసులు. దీంతో పోలీసులకు ఆందోళన కారులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో స్మశాన వాటిక సాధన కమిటీ కన్వీనర్ తాడూరి గగన్ కుమార్ స్పృహ తప్పి పడిపోయాడు. అయినప్పటికీ పోలీసులు బలవంతంగా లాక్కెళ్లారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేశారు.