ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా కరీంనగర్‌లో ఎంపీ బండి సంజయ్ ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది. ఎంపీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించటంతో బీజేపీ శ్రేణులు తీవ్రంగా ప్రతిఘటించాయి. దీంతో పోలీసులు-బీజేపీ కార్యకర్తలకు మద్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బలవంతంగా ఎంపీని పోలీసులు అరెస్ట్ చేయటంతో… కిలోమీటర్ల మేర కార్యకర్తలు ఎంపీని తీసుకెళ్తున్న కారుతో పరుగెత్తి, కారుకు అడ్డంగా పడుకున్నారు. దాంతో ఎంపీ కలగజెసుకొని నచ్చజెప్పటంతో… పరిస్థితి సద్దుమణిగింది.