బ్రిటన్ లో వెలుగు చూసిన కరోనా కొత్త స్ట్రెయిన్ ఇప్పుడు కరీంనగర్ ను వణికిస్తోంది. బ్రిటన్ నుండి తెలంగాణకు డిసెంబర్ 9 తర్వాత 1200మంది వరకు వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. వారందరినీ ట్రెస్ చేస్తూ, ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో కరీంనగర్ కు చెందిన వారు 16మంది ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు.
అయితే, ఈ 16మందిలో ఇప్పటికే 10మందిని ట్రేస్ చేశారు. మరో ఆరుగురు మాత్రం ట్రేస్ చేయాల్సి ఉంది. కానీ వారు ఎక్కడున్నది అధికారులకు అంతు చిక్కటం లేదు. గుర్తించిన 10మంది వద్ద నుండి శాంపిల్స్ తీసుకొని, హోంక్వారెంటైన్ లో ఉండాలని కోరారు. వారి ఫలితాలు వస్తే కానీ కొత్త స్ట్రెయిన్ ఉందా లేదా అన్నది క్లారిటీ రాదు. కానీ ఆచూకి తెలియని వారి గురించే ఇప్పుడు అసలు సమస్యగా మారింది. గతంలో తబ్లీగా జమాత్ నుండి వచ్చిన కార్యకర్తలతో కరీంనగర్ లో కరోనా కేసులు పెరిగాయి. దీంతో ఇప్పుడు ఇంగ్లాండ్ నుండి వచ్చిన వారు ఏం చేస్తారో అన్న భయం మాత్రం వారిని వెంటాడుతోంది.