టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో తిరుచానూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. నారా లోకేష్ బస చేస్తున్న టెంట్ సైట్ వద్ద నోటికి తెల్ల రిబ్బన్ కట్టుకొని కొందరు తిరుపతి వైసీపీ కార్పొరేటర్లు సహా కేడర్ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
మాతో రండి.. చేసిన అభివృద్ధి చూపిస్తామంటూ.. ప్ల కార్డులు చేత పట్టి నిరసనకు దిగారు వైసీపీ నేతలు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పై నిన్న తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు నారా లోకేష్. దీంతో వైసీపీ నేతలు ఈవిధంగా నిరసనకు దిగారు.
రంగంలోకి దిగిన పోలీసులు అలిపిరి పోలీసు స్టేషన్ కు వైసీపీ నేతలను తరలించారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడంతో అక్కడ వాతారణం వేడెక్కింది.
లోకేష్ నాయుడు గారు అవినీతి నిరూపించండి లేదా.. క్షమాపణలు చెప్పండి.. అంటూ ప్ల కార్డులతో నిరసన తెలిపారు. పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు.