వరంగల్ రైల్వే స్టేషన్ లో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ, బీఆర్ఎస్ పోటాపోటీ నినాదాలతో మారుమోగింది. ఉదయం ప్రధాని మోడీ ప్రారంభించిన వందే భారత్ రైలుకు స్వాగతం పలికేందుకు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వరంగల్ స్టేషన్ కు చేరుకున్నారు.
దేశ్ కీ నేత కేసీఆర్, బీఆర్ఎస్ జిందాబాద్ అంటూ ఆ పార్టీ కార్యకర్తలు, మోడీ మోడీ.. బీజేపీ జిందాబాద్ అంటూ ఆ పార్టీ నేతలు పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు.
ఇరు వర్గాల నినాదాలతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి చేయిదాటిపోకుండా పోలీసులు భారీగా మోహరించారు.
ఇరు పార్టీల నాయకులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఎలాంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా రైల్వే, సివిల్ పోలీసులు చర్యలు చేపట్టారు.