తెలుగు పేపర్ కు బదులుగా సంస్కృతం పేపర్ రావటంతో 35 మంది పదవతరగతి విద్యార్థులు ఇబ్బంది ఘటన నిర్మల్ జిల్లా బైంసాలో వివేకానంద పాఠశాలలో చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని వివేకానంద హైస్కూల్ లో 35 మంది విద్యార్థులు పదవ తరగతి చదువుతున్నారు తెలుగు పేపర్ కు బదులు సంస్కృతం కోర్స్ పేపరు ఇవ్వడం తో విద్యార్థులు ఆందోళన దిగారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థుల పరిక్ష ఫీజు కట్టే సమయం లో చేసిన తప్పు కారణంగా ఇలా జరిగినట్టు తెలుస్తుంది. హాల్ టిక్కెట్ లో కూడా తెలుగు కు బదులు కంపోజిటీవ్ కోర్స్ సబ్జెక్టు రావడం తో అప్పుడే విద్యార్థులు యాజమాన్యం ప్రశ్నించగా బోర్డు తో మాట్లాడినట్లు పరీక్ష హాలు కు వచ్చి మీకు మేము తెలుగు పేపర్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు చెప్పారు. తీరా పరీక్షలో తెలుగు పేపర్ కు బదులు వేరే పేపర్ ఇవ్వడం యాజమాన్యం స్పందించక పోవడం పై విద్యార్థులు మండిపడుతున్నారు.
దీనితో వివేకానంద హై స్కూల్ లోని 35 మంది విద్యార్థుల భవిష్యత్తు అయోమయంలో పడింది. స్కూల్ యాజమాన్యం తప్పిదంతో చదివింది ఒక సబ్జెక్ట్ అయితే రాసింది మరో సబ్జెక్టని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వేల కు వేలు ఫీజు లు తీసుకొని విద్యార్థుల భవిష్యత్తు తో ఆడుకునే స్కూల్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని కోరారు.