రేపట్నుంచి పదో తరగతి ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. దీని కోసం విద్యాశాఖ పూర్తి ఏర్పాట్లను చేయడం జరిగింది. రేపటి నుంచి ఈనెల 13 తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,652 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది.
అయితే ఈ వార్షిక సంవత్సరానికి గాను 4,94,620 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అంటే 3 గంటల పాటు పరీక్ష ఉంటుంది. అయితే సైన్స్, కాంపోజిట్ పేపర్లకు మాత్రం అదనంగా 20 నిమిషాలు కేటాయించడం జరుగుతుంది.
ఈ పరీక్షల నిర్వహణ కోసం బోర్డు ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. ముఖ్యం గా ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు అసౌర్యం కల్గకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు విద్యార్థుల కోసం ఆర్టీసీ కూడా ఉచిత ప్రయాణ అవకాశం కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 144 సిట్టింగ్ స్కాడ్ లను రంగంలోకి దింపారు.
ఈ ఏడాది 11,456 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. అయితే ఈ సారి ఫుల్ సిలబస్ కు పరీక్షలు పెడుతోంది ప్రభుత్వం. అదే విధంగా చివరి పదిహేను నిమిషాల్లోనే బిట్ పేపర్ ఇవ్వనున్నారు.