తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల 3 నుంచి ప్రారంభం కానున్న టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కు కసరత్తు మొదలైంది. ఈ రోజు నుంచి అధికారిక వెబ్ సైట్లో హాల్ టికెట్లను విద్యాశాఖ అందుబాటులో పెడుతుంది.
ఇక ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 4,94,616 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాస్తున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 3 న ఫస్ట్ లాంగ్వేజ్, 6 న ఇంగ్లీష్, 8 న గణితం, 10న సైన్స్, 11న సోషల్, 12న ఓరియంటల్. 13న పేపర్ 2 పరీక్షలుంటాయి. వీటి నిర్వహణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది.
ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. కానీ సైన్స్ పరీక్ష మాత్రం మధ్యాహ్నం 12.50 వరకు ఉంటుంది. అదే విధంగా మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నపత్రం ఆఖరి 15 నిమిషాల ముందే ఇవ్వడం జరుగుతుంది.ఇక ఇలా ఉంటే టెన్త్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది.
పరీక్షలు రాసే విద్యార్థులు జస్ట్ హాల్ టికెట్ చూపిస్తే చాలు.. టికెట్ తీసుకోకుండానే ప్రయాణం చేయొచ్చు. అయితే ఇంటి నుంచి ఎగ్జామ్ సెంటర్ కి.. అక్కడి నుంచి ఇంటికి మాత్రమే. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఈ సౌకర్యాన్ని కల్పిస్తూ టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.