ప్రముఖ చిప్స్ తయారీ సంస్థ లేస్ కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియాలో లేస్ చిప్స్ చాలా ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. తాజాగా లేస్ కంపెనీకి ఇండియాలో పెద్ద షాక్ తగిలింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే..లేస్ చిప్స్ తయారు చెయ్యడానికి ఉపయోగించే బంగాళదుంప వంగడంపై రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తమపేరిట ఉన్నందున పూర్తి హక్కులు తమవేనని ఇంకా ఇతర రైతులెవరూ కూడా (ఒప్పంద పరిధిలో ఉన్నవాళ్లని మినహాయించి) వాటిని పండించడానికి వీల్లేదంటూ న్యూయార్క్‌కు చెందిన ఈ మల్టీనేషనల్ ఫుడ్ కంపెనీ మొదటి నుంచి కూడా వాదిస్తూ రావడం జరిగింది.
అయితే కేవలం లిమిట్స్ ఉంటాయే తప్ప.. పూర్తిగా రైతుల్ని నిలువరించడం కుదరదని,దానికి చట్టం సైతం అంగీకరించదంటూ PPVFR తీర్పు వెలువరించడం జరిగింది.ఇక ఈ మేరకు పెప్సీకో కంపెనీకి గతంలో జారీ అయిన పేటెంట్ హక్కుల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రైతులు ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు.
‘రైతుల విత్తన స్వేచ్ఛ’ను ఉల్లంఘించకుండా ఇతర విత్తన ఇంకా అలాగే ఆహార సంస్థలను కూడా నిలువరించాలని ఈ సందర్భంగా PPVFRను రైతుల తరపున పిటిషన్ దాఖలు చేసిన కవిత కురుగంటి కోరుతుండటం జరుగుతుంది. ఇక ఈ వ్యతిరేక పరిణామంపై స్పందించేందుకు పెప్సీకో కంపెనీ నిరాకరించింది.