వారిద్దరూ వృద్ద దంపతులు… జీవిత చరమాంకంలో ఉపయోగపడుతుందని పైసా పైసా దాచి పెట్టారు. సుమారు రూ. లక్షన్నర వరకు కూడబెట్టారు. కానీ వారిని విధి చెదల రూపంలో వెక్కిరించింది. కష్ట పడి దాచుకున్న డబ్బు మొత్తాన్ని చెదలు నాశనం చేశాయి. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాలలోకివెళ్తే.. ఇల్లందు మండలం బాలాజీ నగర్‌కు చెందిన గడ్డం లక్ష్మయ్య, లక్ష్మీ దంపతులు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. లక్ష్మయ్య కూలీ పనులు చేస్తుండగా, భార్య లక్ష్మీ ఎండు మిర్చి తొడిమెలు తీసుకుంటూ సంపాదిస్తున్నారు.
వీరిద్దరూ కలిసి మొత్తం రూ. లక్షన్నర వరకు దాచుకున్నారు. పిల్లలు లేని తమకు ఆ సొమ్ము ఆసరగా ఉంటుందని భావించారు. కానీ చెదలు వారి ఆశలపై నీల్లు చల్లింది. సూట్ కేసులో దాసుకున్న మొత్తాన్ని చెదలు కొట్లాయి. దీంతో నోట్లన్ని పూర్తిగా పాడైపోయాయి.
దీంతో నోట్ల ముక్కలు పట్టుకుని ఆ వృద్ద దంపతులు బ్యాంకుల చుట్టూ తిరిగారు. కానీ తమను అక్కడ ఎవరూ పట్టించుకోవటంలేదని వారు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమ డబ్బులు దక్కేలా చూడాలంటూ ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు.