తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. తమ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వీలైనంత వరకు చర్యలు తీసుకుంటారు.
కానీ ఇరాక్ కు చెందిన ఓ తండ్రి మాత్రం తన కొడుకును ప్రమాదంలో పెట్టి ఓ ఫీట్ చేశాడు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ తండ్రి చేసిన పనిపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఆ వీడియోలో తన కొడుకును సిగరెట్ నోట్లో పెట్టుకోవాలని ఓ తండ్రి అడుగుతున్నాడు. దీంతో ఆ కొడుకు తన తలను పైకెత్తి సిగరెట్ నోట్లో పెట్టుకుని నిలబడ్డాడు. సిగరెట్ ను ఆ తండ్రి ఏకే 47తో గురిపెట్టి కాల్చాడు.
ఆ తర్వాత కొడుకును కూర్చోబెట్టి మళ్లీ అదే ఫీట్ రిపీట్ చేశాడు. ఈ ఫీట్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కొడుకు లైఫ్ ను రిస్కులో పెట్టి ఇలాంటి ఫీట్స్ చేయడమేంటని తండ్రిపై నెటిజన్లు మండిపడుతున్నారు.