జమ్మూకాశ్మీర్ లో భారీ ఉగ్ర కుట్రను భగ్నమైంది. స్వాతంత్ర్య వేడుకల్లో బాంబు దాడులకు ప్లాన్ చేసిన నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. ముష్కరులు జైషే ఈ మహ్మద్ ఉగ్ర సంస్ధకు చెందినవారిగా గుర్తించారు.
ఆగస్టు 15 సందర్భంగా తనిఖీలు చేపట్టగా పట్టబడ్డారు ఉగ్రవాదులు. ఈ నలుగురు డ్రోన్ల ద్వారా ఆయుధాలను సేకరించి మిగిలిన ఉగ్రవాదులకు సరఫరా చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే టూవీలర్ కు ఐఈడీ అమర్చి పేలుళ్లు జరపాలని కుట్ర పన్నారు.
భద్రతా బలగాలు ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాయి. అయోధ్య రామ మందిరం, పానిపట్ చమురు శుద్ధి కర్మాగారం వంటివి టార్గెట్ గా దాడులకు ప్లాన్ చేశారు ముష్కరులు.