ఆలోచన ఉండలే గానీ ఎంతో ఖర్చు పెట్టి కొనలేని లగ్జరీ కార్లను అయినా ఎలాగోలా సొంతం చేసుకోవచ్చు. అవును.. అతను కూడా సరిగ్గా అదే చేశాడు. టెస్లా కంపెనీకి చెందిన కార్లు మార్కెట్లో ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. అయితే ఆ కార్‌ను కొనాలంటే 70వేల డాలర్లు.. అంటే మన కరెన్సీలో దాదాపుగా రూ.50,94,215 అవుతుంది. కానీ అంత మొత్తంలో ఖర్చును ఎవరూ భరించలేరు. అయినప్పటికీ అతను చాలా తెలివిగా ఓ టెస్లా కార్‌నే తయారు చేశాడు.
అమెరికాలోని మసాచుసెట్స్ లో ఉన్న సలేం అనే ప్రాంతానికి చెందిన రిచ్ అనే వ్యక్తి రిచ్ రీబిల్డ్స్ పేరిట ఓ యూట్యూబ్ చానల్‌ను నిర్వహిస్తున్నాడు. అందులో కార్లను రీబిల్డింగ్ చేయడంపై అతను వీడియోలు పెడుతుంటాడు. అయితే టెస్లా కార్‌ను అతను కొందామనుకున్నాడు. కానీ అంత మొత్తంలో డబ్బులు లేవు. దీంతో అతనికి ఓ ఆలోచన వచ్చింది. వెంటనే దాన్ని అమలులో పెట్టేశాడు.
రిచ్ రెండు చోట్ల రెండు పాత టెస్లా కార్‌లను కొనుగోలు చేశాడు. వాటిల్లో తనకు పనికి వచ్చే పార్ట్‌లను మాత్రమే తీసుకున్నాడు. మిగిలిన పార్ట్‌లను అమ్మేశాడు. దీంతో తాను ఆ కార్ల కొనుగోలుకు పెట్టిన సొమ్ములో కొంత రికవరీ అయింది. ఇక తాను వాటి నుంచి తీసుకున్న పార్ట్‌లకు, ఇంకొన్ని వేరే కార్లకు చెందిన పార్ట్‌లను కలిపి టెస్లా కార్‌ను తయారు చేశాడు. ఈ క్రమంలో మొత్తం అతనికి 6వేల డాలర్లు.. అంటే సుమారుగా రూ.4,36,647 ఖర్చు అయింది. అయినప్పటికీ అద్భుతమైన టెస్లా కారు రూపుదిద్దుకుంది. ఈ క్రమంలో ఆ కార్‌ను అతను తన కుమార్తెకు ఇవ్వగా దాన్ని ఆమె కాలేజీకి తీసుకెళ్తోంది. ఈ క్రమంలో ఆ కార్‌ను చూసి అందరూ షాక్ అవుతున్నారు.
సాధారణంగా టెస్లా కార్ అంటే పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చవుతుంది. అయితే వారిది సాధారణ కుటుంబం అయి ఉండి కూడా టెస్లా కార్‌ను అలా ఎలా కొన్నారు ? అని అందరూ షాకవుతున్నారు. ఇక ఆ కార్‌కు చెందిన వీడియో వైరల్‌గా మారింది.
Watch Video: