గుంటూరు: కర్నూలులో రాజధాని ఏర్పాటు చేస్తే పైసా ఖర్చు లేకుండా అభివృద్ధి జరుగుతుందని ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. రాజధానికి అవసరమైన భవనాలు కర్నూలులో చాలా ఉన్నాయని గుంటూరులో మాట్లాడుతూ ఆయన చెప్పారు. రాజధాని ఏర్పాటు అంటే రాష్ట్రాన్ని విడగొట్టడం కాదంటున్న వెంకటేష్.. అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించాలన్న తన డిమాండ్‌ను మళ్లీ వినిపించారు. గత ఐదేళ్లలో రాయలసీమను చంద్రబాబు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. త్వరలో కర్నూలుకు ఓ పెద్ద ప్రాజెక్టు రాబోతోందని వెల్లడించారు. అదేమిటనేది చెప్పలేదు.