వివాదాస్పదమైన బంజారాహిల్స్ స్థలంతో తనకెలాంటి సంబంధం లేదన్నారు బీజేపీ నేత టీజీ వెంకటేష్. ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేశారు. ఆ ఘటన జరిగిన సమయంలో తాను లక్ష్యదీప్ టూర్ లో ఉన్నట్లు తెలిపారు. 17న గ్రూపుతో టీజీ విశ్వప్రసాద్ ఏపీ జెమ్ ప్రాపర్టీ మీద దురాక్రమణ జరిగిందని కేసు పెట్టడం జరిగిందని… అప్పుడు ఎఫ్ఐఆర్ లో తన పేరు లేదన్నారు. కానీ.. తర్వాతి రోజు 18న రీజాయిండర్ లో చేర్చారని తెలిపారు. రెండు గ్రూపులు ఆస్తి కోసం ఫైట్ చేస్తున్నారని.. దాంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఆ ప్రాపర్టీ గురించి తన ముందు ఎప్పుడూ ఎవరూ ప్రస్తావించలేదన్నారు వెంకటేష్. టీజీ విశ్వప్రసాద్ అంటే టీజీవీ అని వస్తుందని.. అలాగే తన పేరు కూడా టీజీవీ అనే వస్తుందని వివరించారు. ఆదోని నుంచి వచ్చినంత మాత్రాన టీజీ విశ్వప్రసాద్ కు తనకు సంబంధాలు ఉంటాయని అనుకోవడం అవివేకమని తెలిపారు. విశ్వప్రసాద్ ఈ ఘటన గురించి అమెరికా నుంచే ఒక ప్రకటన ఇచ్చారన్నారు. విషయం తెలిసిన వెంటనే తన బ్రదర్ కు కాల్ చేసి పోలీస్ ఆఫీసర్ కు తన తరఫున స్టేట్ మెంట్ కూడా ఇచ్చినట్లు చెప్పారు.
తాను పార్లమెంటరీ స్టాడింగ్ కమిటీ సభ్యుడిగా లక్ష్యదీప్ లో పర్యటిస్తున్నానని.. ఈ విషయాన్ని పోలీస్ అధికారులకు లిఖిత పూర్వకంగా వెల్లడించానన్నారు టీజీ వెంకటేష్. మంగళవారమే బెంగళూరుకు వచ్చానని.. ఏపీ జెమ్స్ కంప్లయింట్ చేసినప్పుడు అందులో తన పేరు లేదని గుర్తు చేశారు. ఈ వివాదంలో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని ఏపీ జెమ్స్ వాళ్లే లెటర్ కూడా ఇవ్వడం జరిగిందన్నారు.
ఆదివారం ఆదోనీకి చెందిన ముఠా మారణాయుధాలతో నగరంలో కలకలం సృష్టించారు. దాదాపు 90 మంది బంజారాహిల్స్ లోని వంద కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని ఆక్రమించికునేందుకు ప్రయత్నించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. అడ్డొచ్చిన సెక్యూరిటీ గార్డులను బెదిరించారు కంప్లయింట్ చేశారు. 63 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. టీజీ వెంకటేష్ పైనా కేసు నమోదు చేశారు. అయితే.. ఈ వివాదంలో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని టీజీ విశ్వనాథ్ ప్రకటించారు.