ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ దర్శకుడు స్వరూప్ దర్శకత్వంలో తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో ప్రేక్షకులముందుకు రాబోతున్న చిత్రం మిషన్ ఇంపాజిబుల్. ఈ చిత్రం ఏప్రిల్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదే విషయాన్ని అధికారికంగా మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు ప్రకటించారు. తిరుపతికి సమీపంలోని ఒక చిన్న గ్రామంలో జరిగే బౌంటీ హంటింగ్ కామెడీ సినిమానే ఈ మిషన్ ఇంపాజిబుల్.
ఈ సినిమాలోని కామెడీ ఆనందాన్ని అందిస్తుందని… ఈ సంవత్సరంలో అతి పెద్ద చిన్న సినిమా కోసం సిద్ధంగా ఉండండి అంటూ డైరెక్టర్ స్వరూప్ ట్వీట్ చేశారు.
ఇక కొత్తగా రిలీజ్ చేసిన పోస్టర్ లో తాప్సీ టీనేజర్స్‌తో దేనినో వెంబడిస్తూ కనిపించింది. నిజానికి ఈ సినిమా షూటింగ్ గత ఏడాది పూర్తయింది. కానీ వివిధ కారణాలతో వాయిదా పడింది. ఈ సినిమాను ఆచార్య నిర్మాతలు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి లు నిర్మించారు.