థాయ్ లాండ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. థాయ్ లాండ్ ప్రభుత్వ నేషనల్ వ్యాక్సిన్ ఇన్ స్టిట్యూట్ ఈ వ్యాక్సిన్ రూపకల్పన చేసింది. ఇప్పటికే ఎలుకలపై ఈ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేయటంతతో… వచ్చే వారంలో కోతులపై ప్రయోగించేందుకు థాయ్ శాస్త్రవేత్తలు సన్నద్ధమవుతున్నారు.
వచ్చే సంవత్సరం ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని… వ్యాక్సిన్ సక్సెస్ అవుతుందన్న నమ్మకం ఉన్నట్లు థాయ్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎం-ఆర్ఎన్ఎ తో ప్రయోగాలు చేస్తున్నట్లు ప్రకటించింది.
దాదాపు 100కి పైగా కంపెనీలు, వివిధ దేశాలతో కలిసి వ్యాక్సిన్ పై ప్రయోగాలు చేస్తున్నాయి. కానీ వ్యాక్సిన్ రావడానికి మరో సంవత్సరం అయినా పట్టొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ లోనే ప్రకటించింది. ప్రముఖ కంపెనీలు జాన్సన్ అండ్ జాన్సన్ తో పాటు చాలా కంపెనీలు క్లినికల్ పరీక్షలకు సిద్ధమవుతున్నాయి. అమెరికా ఔషధ సంస్థ మెడెర్నా ఇప్పటికే కొద్దిమందిపై కరోనాపై పోరాడగల యాంటీబాడీస్ ను ప్రయోగించింది. దీనికి సంబంధించిన పూర్తి డేటా ఇంకా రావాల్సి ఉంది.
చైనా తర్వాత థాయ్ లాండ్ లోనే కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. జనవరి మొదట్లోనే కేసులు రావటంతో థాయ్ ప్రభుత్వం నివారణ చర్యలను చేపట్టడంతో పాటు వ్యాక్సిన్ కోసం పనిచేస్తుంది.