థాయ్ లాండ్ లో ఓ సైనికుడు 26 మందిని కాల్చి చంపాడు. మరికొంత మంది గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. నకోమ్ రచసిమ నగరంలో ఈ సంఘటన జరిగింది. మిలటరీ క్యాంపులో తన కమాండర్ ను చంపి అతని ఆయుధాన్ని లాక్కున్న సైనికుడు నగరంలోని వీధుల్లో, షాపింగ్ మాల్స్ లో కనిపించిన వారిపైనా కాల్పులు జరిపాడు. ఆ తర్వాత భద్రతా దళాలు అతన్ని వెంబడించగా ఓ బిల్డింగ్ లో దాక్కున్నాడు. బిల్డింగ్ లో దాక్కున్న అతన్ని భద్రతా దళాలు కాల్చి చంపాయి. కాల్పుల్లో గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని ఆ దేశప్రధాన మంత్రి ప్రయుత్ చన్ -ఒచా పరామర్శించారు. ఇలాంటి సంఘటన దేశంలో గతంలో ఎన్నడూ జరగలేదని..ఇదే చివరిది కావాలన్నారు.
చనిపోవడానికి ముందు సోషల్ మీడియాలో అతను కొన్ని పోస్టులు పెట్టాడు. ఓ ఆస్తి వివాదంలో అతను మోసపోవడంతో కక్ష పెంచుకొని ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది.