ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన సంప్రదాయాలు, ఆచారాలు ఉంటాయి. అవి ఆ ప్రాంతానికే ప్రత్యేకతను తీసుకువస్తాయి. అలాగే, వంటకాల్లో కూడా ప్రాంతాన్ని బట్టి ప్రత్యేకమైనవి ఉన్నాయి. హైదరాబాద్ బిర్యానీ, కాకినాడ కాజా, అంకాపూర్-చికెన్.. ఇలా ఎన్నో వెరైటీలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఫేమస్ అయిన ఈ వెరైటీలు మరో ప్రాంతాల్లో దొరకవు. అందుకే కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడ దొరికే వెరైటీ ఫుడ్‌ను టేస్ట్ చేయాలని అనుకుంటారు అంతా.
Advertisements
ఇక మన దేశానికి వస్తే సౌత్ ఇండియన్ ఫుడ్, నార్త్ ఇండియన్ ఫుడ్ అంటూ ఎన్నో వెరైటీలు ఉన్నాయి. అక్కడి వాళ్లు ఇక్కడి వచ్చినా.. ఇక్కడి వాళ్లు అక్కడికి వెళ్లినా ఫుడ్‌ను బాగా ఎంజాయ్ చేస్తారు. అంతేందుకండి భారతీయ వంటకాలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అని చెప్పవచ్చు. ఒక్కసారి తిన్నరంటే మైమరచిపోయేలాగా ఉంటుంది మన భారతీయ భోజనం. అందుకే విదేశీయులు కూడా మన దగ్గరి వెరైటీ వంటకాలను పూర్తిగా ఆస్వాదిస్తూ తింటారు.
తాజాగా థాయిలాండ్‌కు చెందిన ఓ యూట్యూబర్.. తొలిసారి సౌత్ ఇండియన్ ఫుడ్‌ను టేస్ట్ చేశాడు. బ్యాంకాక్‌లో ఉన్న సుగమ్ అనే సౌత్ ఇండియన్ రెస్టారెంట్‌లో ఫుడ్ బ్లాగర్ మార్క్ వీన్స్ సౌత్ ఇండియన్ థాలీని ట్రై చేశాడు. సౌత్ ఇండియా థాలీ అంటే ఎలా ఉంటదో తెలుసు కదా.. 10 రకాల కూరలు, కాసింత అన్నం, పులుసు, చట్నీ, వడ.. ఇలా అన్ని రకాల కూరలను టేస్ట్ చేసిన ఆ వ్యక్తి మైమరిచిపోయాడు. వావ్.. ఇలాంటి ఫుడ్ ఎప్పుడూ తినలేదు అంటూ వీడియోలో చెప్పుకొచ్చాడు. చేతితో అన్నాన్ని కలుపుకొని ఆ వ్యక్తి తినేశాడు. చివర్లో పచ్చిపులుసును చేతుల్లో పోసుకొని వావ్ అనేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.