ఆగష్టు 8న ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ అయిన అజిత్ సినిమా నెర్కొండ పార్వై. పింక్ రీమేక్ గా వచ్చిన ఈ సినిమాని హెచ్ వినోద్ డైరెక్ట్ చేయగా బోనీ కపూర్ నిర్మించాడు. 180కోట్లు రాబట్టిన నెర్కొండ పార్వై కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ అజిత్ అనౌన్స్ చేసిన లేటెస్ట్ సినిమా ‘వాలిమై’. AK60గా ఇప్పటివరకూ తల అభిమానులు పిలిచుకున్న ఈ సినిమా పూజ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ AK60కి వాలిమై అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ అనౌన్స్ చేసిన కాసేపటికే తల అజిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాని షేక్ చేశారు.
#Valimai, #Valimai3MillionTarget, ఈ రెండు హాష్ ట్యాగ్ తో ట్వీట్స్ చేసిన అజిత్ అభిమానులు 24 గంటలు తిరిగే లోపు 3 మిలియన్ ట్వీట్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒక టైటిల్ అనౌన్స్మెంట్ రోజునే 24 గంటల్లో 3 మిలియన్ ట్వీట్స్ వేసి కొత్త రికార్డు సృష్టించిన అజిత్ ఫ్యాన్స్, ఇప్పటివరకూ ఉన్న బిగిల్ టైటిల్ ట్రెండ్ ని బ్రేక్ చేశారు. #Bigil ట్యాగ్ 24 గంటల్లో 1.6మిలియన్ ట్వీట్స్ తో ఫస్ట్ ప్లేసులో ఉండగా, దాన్ని బ్రేక్ చేసి సౌత్ ఇండియాలోనే మోస్ట్ ట్వీటేడ్ హ్యాష్ ట్యాగ్ గా వాలిమైని నిలబెట్టారు. ఇప్పటికే మోస్ట్ సెలెబ్రేటెడ్ హ్యాష్ ట్యాగ్ గా విశ్వాసం నిలిచింది, ఇప్పుడు మోస్ట్ ట్వీటేడ్ ట్యాగ్ గా వాలిమై నిలిచింది.