ఇటీవల కాలంలో నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు కంగనా రనౌత్. కంగనా రనౌత్ ప్రస్తుతం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న తలైవి చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో జయలలిత పాత్రలో కంగనారనౌత్ నటిస్తోంది. ఇక ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సినీ ప్రేక్షకులు రిలీజ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ పై చిత్ర యూనిట్ ఓ క్లారిటీ కి వచ్చిందట.
నిజానికి ఈ సినిమా రిలీజ్ కావాల్సివుంది కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రంను వచ్చే నెలలో విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట.