యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా RRR. ఈ సినిమాలో పోరాటయోధుదు అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్, కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారు. అంతే కాదు బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవగన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 2021 జనవరి 8 రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ఎనౌన్స్ చేసినా సంగతి తెల్సిందే.
అయితే RRR సంక్రాంతికి వస్తుండటంతో, మిగిలిన హీరోలు సంక్రాంతికి రావాలనే ఆలోచనను మానుకుంటున్నారు. కానీ తమిళ్ హీరో విజయ్ వెనక్కి తగ్గేది లేదని సంక్రాంతి బరిలో నిలవాలని ప్రయత్నిస్తున్నాడట. మాములుగా సంక్రాంతి అంటే సినిమా రిలీజ్ కు మంచి సమయం. అలాంటి సమయంలో RRR లాంటి సినిమాలు ఉంటే కొద్దిగా ఆలోచించాల్సిన అవసరమైతే ఎంతైనా ఉందని చెప్పాలి. కానీ విజయ్ మాత్రం సుధా కొంగర దర్శకత్వం లో వస్తున్న సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చెయ్యాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. మరి RRR సినిమాను తట్టుకుని విజయ్ ఏ మేర నిలుస్తాడో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.