తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మాస్టర్. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతోంది. అయితే నిజానికి ఈ చిత్రం గత ఏడాది రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది.
అయితే ఈ సినిమా ఫిబ్రవరి 12 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్స్ లో చూడని వాళ్ళు ఫిబ్రవరి 12 నుంచి అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.